
మెహిదీపట్నం, వెలుగు : ఎన్నికల తనిఖీల్లో భాగంగా నాంపల్లి ఎస్వోటీ, ఆసిఫ్ నగర్ పోలీసులు భారీగా డబ్బును పట్టుకున్నారు. బుధవారం ఉదయం మల్లేపల్లి చౌరస్తాలో తనిఖీలు చేపట్టిన పోలీసులు మంగళ్‌హాట్ నుంచి కారులో వస్తున్న వ్యాపారి నిఖిల్‌ను ఆపి తనిఖీ చేశారు. కారులో తరలిస్తున్న రూ.21 లక్షల 50 వేల క్యాష్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బుకు సంబంధించి అతడు ఎలాంటి పేపర్లను చూపించకపోవడంతో సీజ్ చేశారు.