
కోల్‌బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణం లోని కార్మెల్ డిగ్రీ కాలేజీలో మంగళవారం నిర్వహించిన జాబ్‌మేళాకు నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆదిలాబాద్క్యాథలిక్ మెత్రాసనం, డాన్ బాస్కో క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించారు.
22 కంపెనీల నుంచి ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు నిర్వహించిన మేళాకు 400 మంది అభ్యర్థులు హాజరు కాగా, 210 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు కార్మెల్ కాలేజీ డైరెక్టర్ డాక్టర్ ఫాదర్ జేవియర్ రెక్స్, యూత్ వింగ్డైరెక్టర్ ఫాదర్ జిజో, ఫాదర్ షాపియన్, డాన్‌బాస్కో నిర్వాహకులు ఫాదర్ జస్టిన్ నియామక పత్రాలు అందజేశారు.