హెచ్ డీఎఫ్ సీ లాభం రూ.5885 కోట్లు

హెచ్ డీఎఫ్ సీ లాభం రూ.5885 కోట్లు
  • గత ఏడాదితో పోలిస్తే 23 శాతం పెరుగుదల
  • లోన్లు, అసెట్‌ క్వాలిటీ పెరగడమే కారణం
  • తగ్గిన మొండిబకాయిలు
  • షేరుకు రూ.15 చొప్పున డివిడెండ్‌

ముంబై: మనదేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన నాలుగోక్వార్టర్‌‌‌‌లో భారీగా లాభాలు సంపాదించింది . 2017–18 క్యూ4తో పోలిస్తే ఈసారి లాభం 38 శాతం పెరిగిరూ.5,885.12 కోట్లకు చేరింది . ఇది విశ్లేషకుల అంచనాలను మించడం విశేషం. నికరవడ్డీ ఆదాయం 20.3 శాతం పెరిగి రూ.48,243 కోట్లకు చేరింది .సగటు ఆస్తులు 19.8 శాతం వృద్ధిని సాధించడం,నికర వడ్డీ మార్జిన్‌‌‌‌ పెరగడంతో నికరవడ్డీ ఆదాయం భారీగా పెరిగింది . 2018–19 ఆర్థిక సంవత్సరంలోహెచ్‌ డీఎఫ్‌ సీ బ్యాంక్‌‌‌‌ క్రెడిట్‌ గ్రోత్‌ 24.5 శాతానికి చేరింది . లోన్‌‌‌‌ బుక్‌‌‌‌ మొత్తం విలువ రూ.8,19,401కోట్లు నమోదయింది . గత ఏడాది నుంచి బ్యాం కు డిపాజిట్లు 17 శాతం పెరిగి రూ.9,23,141 కోట్లకు చేరుకున్నాయి. బ్యాంకింగ్‌‌‌‌ రంగంలో డిపాజిట్ల సగటువృద్ధిరేటు 10 శాతం మాత్రమే ఉంది.

లిక్విడిటీ రేషియో 118 శాతం

‘‘డిపాజిట్లు పెరగడం వల్ల లిక్విడిటీ కవరేజ్‌రేషియోను118 శాతానికి చేర్చగలిగాం . ఆర్‌‌‌‌బీఐనిర్దేశించిన దానికంటే ఇది ఎక్కువ’’ హెచ్‌ డీఎ-ఫ్‌ సీ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది . దేశీయఅడ్వాన్సులు వార్షిక ప్రాతిపదికన 24.6 శాతం,కరెంట్‌ అకౌంట్స్‌‌‌‌ సేవిం గ్స్‌‌‌‌ అకౌంట్స్‌‌‌‌ 42.4శాతం పెరిగాయి. వార్షిక ప్రాతిపదిక దేశీయ రిటైల్‌‌‌‌ లోన్లు 19 శాతం, హోల్‌‌‌‌సేల్‌‌‌‌ లోన్లు 31.9 శాతంపెరిగాయి. క్యూ 4లో నిర్వహణ ఆదాయం 22.7శాతం పెరిగి రూ.10,843.6 కోట్లు అయింది .నిర్వహణ ఖర్చులు 17.6 శాతం అధికమయ్యాయి. వడ్డీయేతర ఆదాయాలు 15.2 శాతం పెరిగిరూ.4,871 కోట్లకు చేరాయి. ఫీజులు, కమీషన్లుఎక్కువగా రావడమే ఇందుకు కారణం. క్యూ 3తోపోలిస్తే క్యూ 4లో ఆస్తుల నాణ్యత మెరుగుపడింది .స్థూల మొండి బకాయిలు 1.38 శాతం నుంచి 1.36శాతానికి పడిపోయాయి. కేటాయింపులు, ఆగంతుక నిధులు క్యూ 3తో పోలిస్తే క్యూ4లో 14.6 శాతంతగ్గి రూ.1,889 కోట్లకు పడిపోయాయి. గత ఆర్థికసంవత్సరం క్యూ4తో పోలిస్తే మాత్రం 22.6 శాతంపెరిగాయి. ప్రొవిజనింగ్‌‌‌‌ కవరేజి రేషియో 71 శాతం నమోదయింది . క్యాపిటల్‌‌‌‌ అడెక్వసీ రేషియో 171.శాతానికి పెరిగింది . ఫలితాలు బాగుం డటంతో ప్రతిషేరుకు రూ.15 చొప్పున డివిడెండ్‌ ఇవ్వాలని బ్యాంకు సిఫార్సు చేసింది. గత ఏడాది రూ.13 ఇచ్చింది.