
హైదరాబాద్, వెలుగు: కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 219 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో గృహ నిర్మాణానికి సంబంధించిన అప్లికేషన్లు145 ఉండగా, 74 దరఖాస్తులు ఇతర సమస్యలకు సంబంధించినవి ఉన్నాయని చెప్పారు.
అడిషనల్ కలెక్టర్ హేమంత్కేశవ్పాటిల్, డీఆర్వో వెంకటాచారి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు.