కొండ చరియలు విరిగి పడి 22మంది మృతి

కొండ చరియలు విరిగి పడి 22మంది మృతి

ఉత్తర భారతంలో కురుస్తున్న భారీ వర్షాలు సామాన్య ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరపి లేని వర్షాలకు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఇక జమ్ముకశ్మీర్, హిమాచల్​ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర్​ప్రదేశ్​లలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షపాతం నమోదైతవుతోంది. దీంతో పెద్ద ఎత్తున వరదలు సంభవించడంతో పాటు కొండ చరియలు కూడా విరిగిపడుతున్నాయి. తాజాగా కొండ చరియలు విరిగిపడి 22 మంది చనిపోగా.. 6 గురు గల్లంతయ్యారు. 

ఇక మరికొన్ని ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులు తెగిపోయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వరదల కారణంగా కాలువలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. ఇక నిన్నటికి నిన్న కాంగ్రా లోయలో చక్కీ నదిపై ఉన్న ఓ రైల్వే బ్రిడ్జ్​.. వరదల కారణంగా కొట్టుకుపోయింది. పఠాన్​కోట్​- మండి జాతీయ రాహదారిలో కొండచరియలు విరిగిపడటంతో.. ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఉతరాఖండ్ లోనూ వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. కాగా ఓ బాలుడు ఈ వరద నీటిలో చిక్కుపోగా... అతన్ని ఎస్డీఆర్ఎఫ్ దళాలు వెంటనే అక్కడికి చేరుకొని ఆ బాలున్ని రక్షించారు.