
వ్యక్తి బలవన్మరణాకి కారణమయిన భార్య, అత్తను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ మన్మోహన్ యాదవ్ కథనం ప్రకారం.. మల్కాజిగిరి జేఎల్ఎన్ఎస్నగర్లో సాధు ఈశ్వర్ కుమార్(22) కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. ఈశ్వర్ గతేడాది అదే ప్రాంతానికి చెందిన శ్రద్ధ బిహారి(21) అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే శ్రద్ధ తల్లి సంగీత బిహారికి వీరి ప్రేమ వివాహం నచ్చలేదు. వీరిని ఎలాగైనా విడగొట్టాలని తరుచూ గొడవ చేసి ఈశ్వర్మీద అనుమానాలు సృష్టించేది. 3న సంగీత ఈశ్వర్తన బంధువులతో కలిసి కూతురు ఇంటికి వచ్చి గొడవ చేసి శ్రద్ధను పుట్టింటికి తీసుకెళ్లింది. దీంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తనను వేధింపులకు గురి చేస్తున్నారని తీవ్ర మనస్థాపానికి లోనైన ఈశ్వర్ 4న తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. ఉదయం 10 గంటలైనా బయటకు రాకపోవడంతో ఈశ్వర్తల్లిదండ్రులు తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడడంతో అతడు ఉరేసుకుని కనిపించాడు. తన కొడుకు మృతికి అతడి భార్య శ్రద్ధ, అత్త సంగీతలు కారణమని మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కనిపించకుండా తిరుగుతున్న శ్రద్ధ, సంగీతలను బుధవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు సీఐ తెలిపారు.