మెదక్ జిల్లాలో మహిళలకు 223 సర్పంచ్ స్థానాలు

మెదక్ జిల్లాలో మహిళలకు 223 సర్పంచ్ స్థానాలు

మెదక్, వెలుగు: మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డ్ మెంబర్ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 21 మండలాల పరిధిలో మొత్తం 492 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 223 మహిళలకు రిజర్వు అయ్యాయి. కేటగిరీ వారీగా చూస్తే 100 శాతం ఎస్టీ జనాభా ఉన్న వాటిలో 29 సర్పంచ్ స్థానాలు మహిళలకు, 42 ఎస్టీ జనరల్ కు, ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న వాటిలో 10 మహిళలకు, 11 ఎస్టీ జనరల్, ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న వాటిలో 33 మహిళలకు, 44 ఎస్సీ జనరల్ కు, మిగతా వాటిలో 49 బీసీ మహిళలకు, 59 బీసీ జనరల్, 102 అన్ రిజర్వుడ్ మహిళలకు, 113 అన్ రిజర్వుడ్ జనరల్ అయ్యాయి.

వార్డు స్థానాల్లో..

జిల్లాలోని 492 గ్రామ పంచాయతీల్లో మొత్తం 4,220 వార్డు స్థానాలు ఉండగా 100 శాతం ఎస్టీ జనాభా ఉన్న వాటిలో 261 మహిళలకు, 265 ఎస్టీ జనరల్ కు, ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న చోట 55 మహిళలకి, 123 ఎస్టీ  జనరల్, ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న వాటిలో 235 మహిళలకు, 423 ఎస్సీ జనరల్, మిగతా వాటిలో 410 బీసీ మహిళలకు, 588 బీసీ జనరల్ కు, 849 అన్ రిజర్వుడ్ మహిళలకు, 1,011 జనరల్ అయ్యాయి