హైదరాబాద్, వెలుగు: కరోనా ఎఫెక్ట్‌తో విదేశాల్లో ఇండియన్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాము స్వదేశానికి వస్తామని, సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇలా స్పెయిన్‌లోని బార్సిలోని ప్రాంతంలో 23 మంది వరకు ఇండియన్స్ చిక్కుకుపోయారు. ఇందులో ఏడుగురు తెలంగాణవాళ్లు కూడా ఉన్నారు. వీళ్లంతా అక్కడ ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. కరోనా వైరస్‌తో తీవ్రంగా దెబ్బతింటున్న దేశాల్లో స్పెయిన్ ఒకటి. తాము భయం భయంగా ఇక్కడ ఓ హోటల్లో గడుపుతున్నామని, కనీసం తినడానికి ఏమీ దొరకడం లేదని అక్కడి 23 మంది ఇండియన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాకు వద్దామంటే విమానాలు రద్దయ్యాయని, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామని తెలిపారు. వీళ్లంతా తమ బాధలను చెబుతూ ఓ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘‘ఇండియన్ గవర్నమెంట్మాపై దయచూపాలి. ప్లీజ్.. రిక్వెస్ట్ చేస్తున్నం. మాకు సాయం చేయండి.. మమ్మల్ని రక్షించండి. ఇండియాకు చేరుకునేలా ఏర్పాట్లు చేయండి’’ అని వేడుకున్నారు.
