సిరియాపై అమెరికా మరోసారి దాడి.. ఐసిస్ స్థావరాలే టార్గెట్ గా బాంబుల వర్షం

సిరియాపై అమెరికా మరోసారి దాడి.. ఐసిస్ స్థావరాలే టార్గెట్ గా బాంబుల వర్షం

సిరియాపై అమెరికా భీకర దాడులు దాడులు చేసింది.  ఐసిస్ ఉగ్రవాద స్థావరాలే టార్గెట్ గా బాంబుల వర్షం కురిపించింది. ఆపరేషన్  హాక్ స్ట్రైక్ పేరుతో అమెరికా దాడులకు పాల్పడింది. గత నెల ఐసిస్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి చెందగా..సిరియాపై అమెరికా ప్రతికార దాడులకు దిగింది. అమెరికా సైనికులకు హాని కలిగించే ఎవ్వరినీ  వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చింది. 

సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులపై శనివారం తెల్లవారుజామున  అమెరికా సైన్యం  పెద్ద ఎత్తున దాడులు నిర్వహించిందని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ప్రకటించింది.

డిసెంబర్ 19 తర్వాత అమెరికా సిరియాలోని ISIS లక్ష్యాలపై దాడి చేయడం ఇది రెండోసారి. మునుపటి దాడిలో 70 ISIS  ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశారు. నెలరోజుల్లో రెండుసార్లు ఆపరేషన్ హాక్ స్ట్రైక్ లో సిరియాపై దాడుల చేసింది అమెరికా.