బంగ్లాదేశ్లో మరో హిందూ యువకుడి హత్య

బంగ్లాదేశ్లో మరో హిందూ యువకుడి హత్య

ఢాకా: బంగ్లాదేశ్​లో హిందువుల హత్యలు కొనసాగూతూనే ఉన్నాయి. మైనారిటీ హిందువులను లక్ష్యంగా చేసుకుని స్థానిక ముస్లింలు దాడులకు తెగబడుతూనే ఉన్నారు. తాజాగా సునమ్ గంజ్  జిల్లాలో ఒక హిందూ యువకుడిని స్థానిక ముస్లిం దుండగుడు తీవ్రంగా కొట్టి విషం తాగించి హత్య చేశాడు. గురువారం ఈ ఘోరం జరిగింది. మృతుడిని జోయ్ మహాపాత్రోగా గుర్తించారు. 

స్థానిక ముస్లిం యువకుడు అకారణంగానే మహాపాత్రోపై దాడిచేశాడని, బలవంతంగా విషం తాగించాడని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితుడిని హాస్పిటల్​కు తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు. కాగా.. మహాపాత్రో హత్యకు కొద్దిరోజుల కిందే భాండార్​పూర్  గ్రామంలో 25 ఏండ్ల మిథున్  సర్కార్ ను కూడా దుండగులు చంపేశారు. 

దొంగతనం నెపంతో కొట్టి చంపేందుకు యత్నించగా మిథున్.. తప్పించుకునేందుకు ఓ చెరువులో దూకి గల్లంతయ్యాడు. ఈ నెల 6న ఆయన మృతదేహాన్ని రికవరీ చేశారు.