హైదరాబాద్​ ప్రజలకు షాకింగ్​ న్యూస్​... ఎంఎంటీఎస్​ రైళ్లు రద్దు 

హైదరాబాద్​ ప్రజలకు షాకింగ్​ న్యూస్​... ఎంఎంటీఎస్​ రైళ్లు రద్దు 

హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ రైళ్లలో ప్రయాణించే వారికి రైల్వే అధికారులు అలర్ట్‌ జారీ చేశారు. 23 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. మౌలాలి-సనత్‌నగర్‌ స్టేషన్ల మధ్య నాన్‌-ఇంటర్‌ లాకింగ్ పనుల కారణంగా  జంటనగరాల్లో తిరిగే 23 ఎంఎంటీఎస్ రైల్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

నిత్యం పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండే ఎంఎంటీఎస్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు రైల్వే అధికారులు మొత్తం 23 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. నగరంలో ఎంఎంటీఎస్ ఫేజ్-2 మరమ్మతుల కారణంగా ఎంఎంటీఎస్ సర్వీసులతో పాటు పలు రైళ్లను రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. అయితే, తాజాగా మౌలాలి-సనత్ నగర్ మధ్య నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఫిబ్రవరి 4 నుంచి ఈ నెల 11 వరకు 23 ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు మొత్తం 51 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు.

టైమ్ టేబుల్ చార్ట్ మేరకు ఈ నెల 9 వరకు మూడు ఎంఎంటీఎస్ రైళ్లు, 10 వరకు మరో రెండు, ఈ నెల 11 వరకు 18 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా మౌలాలి-అమ్ముగూడ-సనత్‌నగర్‌ మార్గంలో నడిచే హైదరాబాద్‌ -సిర్పూర్‌-కాగజ్‌నగర్‌, వికారాబాద్‌-గుంటూరు, రాయపల్లె-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ను షెడ్యూల్‌ ప్రకారం నిలిపివేయనున్నారు. హైదరాబాద్‌లోని చర్లపల్లిలో నిర్మిస్తున్న రైల్వే టెర్మినల్‌ను ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి సిద్ధం చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం తెలిపారు.

 అందుబాటులోకి మరో టెర్మినల్..

హైదరాబాద్‌లోని చర్లపల్లిలో నిర్మిస్తున్న రైల్వే టెర్మినల్‌ను ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి సిద్ధం చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం తెలిపారు. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా సనత్ నగర్ – మౌలాలి మధ్య రెండో లైను కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. దీంతో సికింద్రాబాద్ స్టేషన్‌ను దాటుకుని కొన్ని రైళ్లను నడిపే అవకాశం ఉంటుందని వివరించారు.