బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీ వివాదంలో చిక్కుకుంది. టీమిండియా మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ కు ఆమెపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఇటీవలే ఇండియా- శ్రీలంక సంయుక్తంగా నిర్వహించిన వరల్డ్ కప్ టోర్నీలో బంగ్లాదేశ్ ,మహళల జట్టు చెత్త ప్రదర్శన చేసింది. ఆడిన 7 మ్యాచ్ ల్లో ఒకటే విజయంతో సరిపెట్టుకొని లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. వరల్డ్ కప్ ఓటమి తర్వాత నిగర్ సుల్తానాపై విమర్శలు వచ్చాయి. సొంత జట్టులోని పేస్ బౌలర్ ఆమె ప్రవర్తన బాగోదంటూ ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది.
బంగ్లా పేసర్ జహనారా ఆలమ్..కెప్టెన్ నిగర్ సుల్తానాపై సంచలన ఆరోపణలు చేసింది. ప్లేయర్స్ ను నిగర్ కోపం వస్తే కొట్టేదని.. ఎన్నో సార్లు జూనియర్లను ఆమె గాయపరిచిందని వెల్లడించింది. తనకు కోపం వస్తే ఇంతమొచ్చినట్టు ప్రవర్తించేదని.. ఈ బంగ్లా పేసర్ నిగర్‌పై విమర్శలు చేసింది. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆలం కామెంట్స్ ను పెద్దగా పట్టించుకోలేదు. నిగర్ సుల్తానాకు సపోర్ట్ చేస్తూ ఆమెపై తమకు పూర్తి నమ్మకం ఉందంటూ సమర్థించింది. తాజాగా బంగ్లా కెప్టెన్.. జహనారా ఆలమ్ చేసిన కామెంట్స్ పై విచిత్రంగా స్పందించింది.
నిగర్ సుల్తానా మాట్లాడుతూ టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ను ఇందులోకి లాగింది. " నేను ఎవరినైనా ఎందుకు కొడతాను? నేనేమైనా హర్మన్‌ప్రీత్‌నా? కౌర్ లాగ బ్యాట్ తో స్టంప్స్‌ను కొట్టేదానిలా కనబడుతున్నానా? నా ప్లేయర్స్ పై నేనెందుకు చేయి చేసుకుంటాను. ఎవరైనా నా వ్యక్తిగత విషయంలో ఏదైనా తప్పుగా అనిపిస్తే.. అప్పుడు నా బ్యాట్‌ను తిప్పుతూ లేదా నా హెల్మెట్‌ను పగలగొడుతూ నా కోపాన్ని ప్రదర్శిస్తానేమో..నా ఇష్టం. నిగర్ సుల్తానా చెప్పింది.
►ALSO READ | Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ ఫెయిల్.. ఇప్పటివరకు జరిగిన 5 టెస్ట్ సిరీస్‌ల రిపోర్ట్ కార్డు ఇదే!
2023లో బంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా అంపైర్ నిర్ణయంపై హర్మన్‌ప్రీత్ కౌర్ తీవ్ర అసంతృప్తికి లోనైంది. నహీదా అక్తర్ బౌలింగ్‌లో హర్మన్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. బంతి బ్యాట్‌కు కాకుండా ప్యాడ్‌కు తాకింది. ఈ క్రమంలో బంగ్లా ఆటగాళ్లు అప్పీలు చేయగా.. అంపైర్ హర్మన్‌ను అవుట్‌గా ప్రకటించాడు. నాటౌట్ అయినా ఔట్ ఇచ్చారనే కోపంతో కౌర్ తన బ్యాట్ ను వికెట్లకేసి కొట్టింది. హర్మన్‌పై ఐసీసీ చర్యలు తీసుకొని ఆమె మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత జరిమానా విధించడంతో పాటు రెండు అంతర్జాతీయ మ్యాచ్‌ల నిషేధం కూడా విధించింది.
Bangladesh women’s captain Nigar Sultana responds to physical assault allegations made by a fellow teammate. pic.twitter.com/nznGFmH5Cr
— CricTracker (@Cricketracker) November 18, 2025
