24గంటల్లో 23వేలకు పైన మొక్కలు నాటిన మారథానర్

24గంటల్లో 23వేలకు పైన మొక్కలు నాటిన మారథానర్

ఒక వ్యక్తి 24గంటల్లో ఎన్ని మొక్కలు నాటగలడు... ? వంద, వెయ్యి, రెండు వేలు.. ఇలా చెప్తామేమో.. కానీ.. అదే 24గంటలో 23వేలకు పైగా మొక్కలు నాటి ఓ మారథానర్ రికార్డు సృష్టించాడు. దీనికి సంబంధించిన వీడియోను మాజీ క్లైమేట్ అండ్ ఎన్విరాన్‌మెంట్ మంత్రి ఎరిక్ సోల్‌హీమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. దాంతో పాటు  "వావ్! క్యూబెక్‌కు చెందిన 23 ఏళ్ల ఆంటోయిన్ మోసెస్ 24 గంటల్లో 23,060 చెట్లను నాటి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. తాను నిమిషానికి ప్రతి 3.75 సెకన్లకు ఒక చెట్టు చొప్పున16 చెట్లను నాటగలనని చెప్పారు" అని రాసుకొచ్చారు. అయితే 15 సెకన్ల నిడివి గల వీడియో 2017, జులై 17న రికార్డు చేసినట్టు తెలుస్తోంది.

చెట్లను నాటడం ద్వారా అడవులను పునరుద్ధరించడం కోసం, అటవీ నిర్మూలనను అరికట్టేందుకు ఆంటోయిన్ చేసిన ఈ పనిని పలువురు కామెంట్ల రూపంలో ప్రశంసించారు. ఈ పని చాలా అద్భుతంగా ఉందని, అయితే వీటిలో ఎన్ని మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి, ఎన్ని మొక్కలు మనుగడ సాధిస్తాయన్నది చూడాలి అని మరికొందరు అభిప్రాయపడ్డారు.

https://twitter.com/buitengebieden/status/1588921543224340480