ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం మంగళవారంతో షూటింగ్ పూర్తయింది.
ఇరవై మూడేళ్ల క్రితం ఇదే రోజున ప్రభాస్ తొలిచిత్రం ‘ఈశ్వర్’ విడుదలైంది. ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేస్తూ ‘ది రాజా సాబ్’ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో ప్రభాస్ అల్ట్రా స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
ప్రభాస్ కెరీర్‌లో మరో ప్రెస్టీజియస్ మూవీగా ఇది నిలుస్తుందని మేకర్స్ తెలియజేశారు. మరోవైపు ఫౌజీ, స్పిరిట్ చిత్రాల్లో ప్రభాస్ నటిస్తుండగా.. సలార్ 2, కల్కి 2 సినిమాలు లైనప్‌లో ఉన్నాయి.
