
న్యూఢిల్లీ: అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) తన గ్లోబల్ జనరేటివ్ ఏఐ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌ను విస్తరించడంలో భాగంగా, జెనరేటివ్ ఏఐ స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడానికి 230 మిలియన్ల డాలర్లను కేటాయిస్తామని ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి ప్రారంభమయ్యే 10-వారాల కార్యక్రమం ద్వారా 80 మంది వ్యవస్థాపకులకు, స్టార్టప్‌లకు సహాయం చేస్తుంది. వీటిలో 20 స్టార్టప్‌లు ఆసియా-–పసిఫిక్ జపాన్ (ఏపీజే) ప్రాంతానికి చెందినవి ఉన్నాయి. ఎంపికైన జెన్ఏఐ స్టార్టప్‌లు మిలియన్ల డాలర్ల విలువైన ఏడబ్ల్యూఎస్ క్రెడిట్‌లు, స్కిల్ డెవలప్‌మెంట్ సెషన్‌లు, బిజినెస్ టెక్నికల్ మెంటార్‌షిప్ నెట్‌వర్కింగ్ అవకాశాలను పొందుతాయని ఏడబ్ల్యూఎస్ ఒక ప్రకటనలో తెలిపింది.