
హైదరాబాద్, వెలుగు: లోహియా గ్రూప్ మేడ్చల్‌లోని తన కొత్త బిస్కెట్ తయారీ ప్లాంట్‌ను బుధవారం ప్రారంభించింది.అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దీనిని నిర్మించామని కంపెనీ చెబుతోంది. మొత్తం ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొత్త ప్లాంట్‌లో నెలకు 1,000 టన్నుల బిస్కెట్లు ఉత్పత్తి అవుతాయి. మాడ్యులర్ సామర్థ్యాలతో 5,000 టన్నుల వరకు పెంచుకునే అవకాశం ఉంది.
గత నాలుగేండ్లలో రూ.300 కోట్లను లోహియా కన్ఫెక్షనరీ ప్రైవేట్ లిమిటెడ్ (ఎల్‌సీపీఎల్) ఇన్వెస్ట్ చేసింది. ఈ ప్లాంట్‌తో 6,000 మందికి ఉపాధి దొరుకుతుందని, ఇందులో 2,000 మంది సైట్‌లో పనిచేస్తారని కంపెనీ పేర్కొంది.