
ముంబై: మహారాష్ట్రలో ఘోరం జరిగింది. రెండు వేర్వేరు ఘటనల్లో గోడ కూలి 24 మంది చనిపోయారు. ఈ ఘటన చెంబూర్, విఖ్‌రోలి ప్రాంతాల్లో జరిగింది. కొద్ది రోజులుగా మహారాష్ట్రలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలకు ముంబైలోని చెంబూర్, విఖ్‌రోలి ఏరియాల్లో గోడలు కూలి ఘోర ప్రమాదాలు జరిగాయి. చెంబూర్‌లో కొండచరియలు విరిగిపడి గోడ కూలడంతో 17 మంది చనిపోగా.. విఖ్‌రోలిలో భవనం గోడ కూలి 7 మంది మృతి చెందారు. ఈ ఘటనలపై ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర సర్కార్ రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.