24 వేల  సబ్‌స్క్రైబర్‌లు... 1.2 మిలియన్​ డాలర్ల సంపాదన

24 వేల  సబ్‌స్క్రైబర్‌లు... 1.2 మిలియన్​ డాలర్ల సంపాదన

దిగ్గజ పారిశ్రామికవేత్త ఎలాన్​ మస్క్​ ట్విటర్​ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.  కాగా తనకు ట్విటర్​లో 24,700 మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారని, వారు ఒక్కొక్కరు నెలకు 4 డాలర్ల చొప్పున తనకు చెల్లిస్తున్నారని మస్క్​ ఏప్రిల్​ 26న వెల్లడించారు.  ఇందుకు సంబంధించిన స్క్రీన్​షాట్​ని ఆయన సోషల్​ మీడియాలో షేర్​ చేశారు. దీంతో ట్విటర్​ సీఈవో ఏటా సుమారు 1.2 మిలియన్​ డాలర్లు ఆర్జిస్తున్నట్టు ఇన్వెస్టర్​ అలెక్స్​కోహెన్​ ట్వీట్ చేశారు.  అంటే మస్క్​ తన చందాదారుల ద్వారా నెలకు కనీసం రూ.81 లక్షలు  సంపాదిస్తున్నారు.  లాంగ్ ఫారమ్ టెక్స్ట్, లాంగ్ లెంగ్త్ వీడియోల వంటి వారి కంటెంట్‌కి యాక్సెస్ కోసం ఛార్జ్​ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తామని ఏప్రిల్​ ప్రారంభంలో ట్విటర్​ తెలిపింది.  వచ్చే 12 నెలలు ట్విటర్​ వినియోగదారులు మానిటైజ్​ అయ్యే కంటెంట్​ నుంచి సంపాదిస్తారని మస్క్​ చెప్పారు. ప్లాట్​ఫాంలో సృష్టికర్తల పనిని ప్రోత్సహించడంలో కూడా కంపెనీ సహాయం చేస్తుందని టెక్​ బిలియనీర్​ పేర్కొన్నారు.