తుంగతుర్తి, వెలుగు: ఎలాంటి అనుమతులు లేకుండా నాగారం మండల పరిధిలోని పేరబోయిన గూడెం బిక్కేరు వాగు నుంచి శనివారం అర్ధరాత్రి ఇసుక తరలిస్తున్న 24 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. సీఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ అక్రమంగా ఎవరైనా ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవనన్నారు. ఈ మేరకు పట్టుకున్న ట్రాక్టర్ల పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
