242 కిలోల గంజాయి పట్టివేత

242 కిలోల గంజాయి పట్టివేత

భద్రాచలం, వెలుగు : కారులో తరలిస్తున్న 228 కిలోల గంజాయిని శుక్రవారం ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌, ఎక్సైజ్‌‌‌‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫీసర్లు శుక్రవారం భద్రాచలంలో తనిఖీలు చేపట్టారు. ఈ టైంలో కారులో అటు వైపు వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫీసర్లను చూపి చర్ల వైపు పారిపోయారు. పోలీసులు వారిని వెంబడించి లక్ష్మీనగరంలో అరెస్ట్‌‌‌‌ చేశారు. కారులో తనిఖీ చేయగా రూ. 65 లక్షల విలువైన 228 కిలోల గంజాయి దొరికింది. వారి నుంచి గంజాయితో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్‌‌‌‌కు చెందిన కరెన్సీని స్వాధీనం చేసుకొని, ముగ్గురు అరెస్ట్‌‌‌‌ చేసి రిమాండ్‌‌‌‌కు తరలించారు.

మణుగూరులో...

మణుగూరు : అక్రమంగా తరలిస్తున్న 14 కేజీల గంజాయిని శుక్రవారం మణుగూరు పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌‌‌‌కు గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు శుక్రవారం మణుగూరులోని సీఎస్పీ కాంటా వద్ద వాహన తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో బైక్‌‌‌‌పై వస్తున్న ఒడిశాలోని మల్కనగిరి జిల్లా చిత్రకొండకు చెందిన గురుకిల, పోదు వంత్నల్‌‌‌‌ను ఆపి తనిఖీ చేయగా గంజాయి దొరికింది. వారి వద్ద నుంచి రూ. 3.5 లక్షల విలువైన 14 కిలోల గంజాయితో పాటు బైక్‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌‌‌‌కు తరలించినట్లు సీఐ సతీశ్‌‌‌‌కుమార్‌‌‌‌ తెలిపారు.