ఆరువేల మంది భక్తులకు 108 సేవలు

ఆరువేల మంది భక్తులకు  108 సేవలు

మంగపేట, వెలుగు:  జాతరలో భక్తులు మొక్కులు తీర్చుకునేటప్పుడు, ప్రమాదాలకు గురైనప్పుడు 24 గంటలు అత్యవసర సేవలు అందించామని వరంగల్ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ శివకుమార్ తెలిపారు.   24  అంబులెన్స్ లు 24  గంటలు సేవలు అందించాయని చెప్పారు. 40 బైక్ అంబులెన్స్​లను డే అండ్ నైట్ రెడీ ఉంచామని పేర్కొన్నారు. రెండు జిల్లాల మేనేజర్లతో పాటు అదనంగా 15 మంది సిబ్బంది సేవలు అందించారన్నారు. 6 వేల 65 మందికి సేవలు అందించడంతో పాటు రెండు డెలివరీ చేసినట్టు వెల్లడించారు.   

సైరన్ వేసుకుని ప్రయాణికుల ట్రాన్స్ పోర్ట్

ఏటూరునాగారం: జాతరలో ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటుచేసిన అంబులెన్స్​  భక్తులను గద్దెల వద్దకు చేర్చి సేవలను దుర్వినియోగం చేసింది. వైద్య ఆరోగ్య శాఖ అంబులెన్స్​(టీఎస్​25టీ6591) సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా జనాలను  తరలించి సొమ్ము చేసుకోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.