వచ్చే జులైలోగా 25 కోట్ల మందికి వ్యాక్సిన్ అందిస్తాం: కేంద్రం మంత్రి హర్షవర్ధన్

వచ్చే జులైలోగా 25 కోట్ల మందికి వ్యాక్సిన్ అందిస్తాం: కేంద్రం మంత్రి  హర్షవర్ధన్

50 కోట్ల డోసులు వస్తాయని అంచనా

హెల్త్ వర్కర్లకే ఫస్ట్ ప్రయారిటీ

రాష్ట్రాల నుంచి ప్రయారిటీ పాపులేషన్ గ్రూప్ లిస్ట్

సండే సంవాద్’ లో కేంద్ర మంత్రి హర్షవర్ధన్

ప్రయారిటీ వీళ్లకే

ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్, శానిటరీ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, సర్వేలెన్స్ ఆఫీసర్లు, ట్రేసింగ్ , టెస్టింగ్ , కరోనా పేషెంట్ల ట్రీట్ మెంట్ డ్యూటీల్లో పాల్గొన్న సిబ్బంది

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జులైలోగా 20 నుంచి 25 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఆదివారం వెల్లడించారు. ఇందులో కరోనా మేనేజ్మెంట్లో పాల్గొంటున్న హెల్త్ వర్కర్లకే ప్రయారిటీ ఇస్తామని చెప్పారు. ఫస్ట్ ఫేజ్ కింద సుమారు 40 నుంచి 50 కోట్ల డోసులు అందుతాయని అంచనా వేస్తున్నట్లు మంత్రి చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్ఫాం ‘సండే సంవాద్’లో తన ఫాలోవర్లతో మంత్రి ఇంటరాక్ట్ అయ్యారు. ఏర్పాట్లలో భాగంగా వ్యాక్సిన్ మేనేజ్మెంట్పై హైలెవెల్ ఎక్స్ పర్ట్ గ్రూప్ను నియమిస్తామని తెలిపారు. ఆరోగ్య శాఖ అధికారులు వ్యాక్సిన్ పంపిణీకి ఫార్మాట్ తయారుచేస్తున్నారని, ప్రయారిటీ పాపులేషన్ గ్రూప్ వివరాలను సబ్ మిట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరతామని చెప్పారు. దీంతోపాటు వ్యాక్సిన్ను స్టోర్ చేయడానికి బ్లాక్ లెవెల్దాకా అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్వివరాలనూ అందించాలని కోరతామన్నారు. ఈ ఎక్సెర్సైజ్ మొత్తం ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.

అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యం..

పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ పంపిణీ చేయాల్సి ఉండడం తో సిబ్బంది నియామకం, వారికి ట్రైనింగ్ సహా ఇతర ఏర్పాట్లను కేంద్రం ఇప్పటికే మొదలెట్టిందని మంత్రి హర్షవర్దన్ చెప్పారు. ఓవైపు ఈ ప్రాసెస్ను ఫైనలైజ్ చేస్తూనే మరోవైపు కరోనా ఇమ్యూనిటీ డాటానూ ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు వివరించారు. వ్యాక్సిన్ పంపిణీలో అన్ని రాష్ట్రాలకూ సమాన ప్రాధాన్యం దక్కేలా చూసేందుకు కేంద్రం జాగ్రత్తలు తీసుకుంటోందని చెప్పారు. దేశంలోని ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ అందించడమే తమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

హైలెవల్ కమిటీ

కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రాసెస్ మొత్తాన్నీ నీతి అయోగ్ మెంబర్ డాక్టర్ వీకే పాల్ ఆధ్వర్యంలోని హైలెవెల్ కమిటీ పర్యవేక్షిస్తుందని మంత్రి చెప్పారు. దేశంలోని వ్యాక్సిన్ తయారీదారులతో టచ్లో ఉంటూ, ఏ టైమ్కు ఎన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది, వాటిని ఎలా ఉపయోగించాలనే దానిపై ఈ కమిటీ కసరత్తు చేస్తోందన్నారు. కంపెనీల నుంచి వ్యాక్సిన్ అందుకున్నంక రాష్ట్రాల వారీగా నిర్ణయించిన కోటా డోసులను పంపిస్తామని, ప్రతీ కన్సైన్మెంట్ను చివరిదాకా ట్రాక్ చేస్తామని వివరించారు. ఫీల్డ్ లెవెల్లో ముందుగా ఎవరికి అవసరమో వారికే వ్యాక్సిన్ అందేలా చూస్తామని, వ్యాక్సిన్ బ్లాక్ మార్కెటింగ్కు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.

స్పుత్నిక్-V ట్రయల్స్…

రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-V ట్రయల్స్ విషయాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. ఈ వ్యాక్సిన్ ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ ను మన దేశంలో చేపట్టే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. కరోనాకు ఒకటి కంటే ఎక్కువ వ్యాక్సిన్ లు తయారవుతున్న క్రమంలో ఏ వ్యాక్సన్ మంచిదనే ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ… అందుబాటులోకి వచ్చే  వ్యాక్సిన్ లు అన్నీ కరోనా ఫైట్ చేయడానికి అనుగుణంగా మన ఇమ్యూన్ సిస్టమ్ను మెరుగు పరుస్తాయని తెలిపారు.