ఫెడరల్ బ్యాంకులో బ్లాక్‌‌‌‌‌‌‌‌స్టోన్‌‌‌‌‌‌‌‌ రూ.6,196 కోట్ల పెట్టుబడి

ఫెడరల్ బ్యాంకులో బ్లాక్‌‌‌‌‌‌‌‌స్టోన్‌‌‌‌‌‌‌‌ రూ.6,196 కోట్ల పెట్టుబడి
  • ప్రిఫరెన్షియల్ ఇష్యూ  రూపంలో  ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌
  • 18 నెలల్లో 9.99 శాతం వాటాగా మారనున్న వారంట్లు

న్యూఢిల్లీ:  ప్రైవేట్ రంగ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌లో  అమెరికా కేంద్రంగా  పనిచేస్తున్న అసెట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ కంపెనీ బ్లాక్‌‌‌‌‌‌‌‌స్టోన్ రూ.6,196.51 కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. తన ఏషియా2 టోప్కో 13 పీటీఈ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌  ద్వారా ప్రిఫరెన్షియల్ ఇష్యూ రూపంలో పెట్టుబడి పెట్టనుంది. బ్యాంక్ 27.30  కోట్ల వారంట్లను జారీ చేస్తుంది. 

ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఒక్కో వారంట్‌‌‌‌‌‌‌‌  రూ.227 ధరకు, రూ.2 ఫేస్ వాల్యూ గల షేరుగా మారుతుంది. వారంట్లతో  భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో నిర్దిష్టమైన ధర దగ్గర షేర్లను కొనుగోలు చేసే హక్కు ఇన్వెస్టర్‌‌కు ఉంటుంది.   ఫెడరల్ బ్యాంక్ ఇష్యూ చేసిన వారంట్లు 18 నెలల గడువు కలిగి ఉంటాయి. బ్లాక్‌స్టోన్‌ తన పెట్టుబడిలో 25శాతం అమౌంట్‌‌‌‌‌‌‌‌ను  మొదట  చెల్లించాలి.

 మిగిలిన  75శాతం అమౌంట్‌‌‌‌‌‌‌‌ను  వారంట్లను షేర్లుగా మార్చేటప్పుడు చెల్లించాలి. గడువు ముగిసే వరకు షేర్లుగా మారని వారంట్లు రద్దవుతాయి. రిఫండ్ ఉండదు.  వారంట్లు పూర్తిగా మార్చిన తర్వాత బ్లాక్‌‌‌‌‌‌‌‌స్టోన్‌‌‌‌‌‌‌‌కి  ఫెడరల్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌లో 9.99శాతం వాటా,  ఒక  డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ పదవి దక్కుతుంది. బ్యాంక్ వచ్చే నెల 19న ఈజీఎం  నిర్వహించి ఈ డీల్‌‌‌‌‌‌‌‌పై షేర్‌‌‌‌‌‌‌‌హోల్డర్ల అనుమతి కోరనుంది.