ఓలా, ఉబర్‌‌‌‌కు పోటీగా భారత్ ట్యాక్సీ

ఓలా, ఉబర్‌‌‌‌కు పోటీగా భారత్ ట్యాక్సీ

న్యూఢిల్లీ:  కేంద్ర ప్రభుత్వం "భారత్ టాక్సీ" పేరుతో దేశంలోనే తొలి సహకార టాక్సీ సేవను వచ్చే నెల ప్రారంభించనుంది.  ఓలా, ఉబర్‌‌‌‌ వంటి ప్రైవేట్ క్యాబ్ సంస్థలతో ఈ ప్లాట్‌‌ఫామ్‌‌ పోటీ పడుతుంది. ఇందులో డ్రైవర్లు కమీషన్ చెల్లించాల్సిన అవసరం లేదు. బదులుగా వారు చిన్న మొత్తంలో మెంబర్‌‌‌‌షిప్ ఫీజు చెల్లిస్తారు. 

నవంబర్ లో ఢిల్లీలో 650 వాహనాలతో భారత్ ట్యాక్సీ సర్వీస్‌‌ల పైలట్ ప్రారంభం కానుంది. డిసెంబర్ నుంచి ఇతర నగరాలకు విస్తరించనుంది. మొదటి దశలో 5 వేల మంది డ్రైవర్లు పాల్గొంటారు. 2026 మార్చి నాటికి మెట్రో నగరాల్లో, 2030 నాటికి   లక్ష డ్రైవర్లతో జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించాలని టార్గెట్ పెట్టుకున్నారు.  

సహకార మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్ (ఎన్‌‌ఈజీడీ) భారత్ ట్యాక్సీ ప్లాట్‌‌ఫామ్‌‌ను డెవలప్ చేసింది.  ఈ సేవను సహకార ట్యాక్సీ కో–ఆపరేటివ్‌‌ లిమిటెడ్ నిర్వహిస్తుంది. రూ.300 కోట్ల  క్యాపిటల్ ఎక్స్‌‌పెండిచర్‌‌‌‌తో  2025 జూన్‌‌లో ఈ సంస్థను ఏర్పాటు చేశారు.