100 రోజుల ఘోరం..రువాండ మరణకాండకు పాతికేళ్లు

100 రోజుల ఘోరం..రువాండ మరణకాండకు పాతికేళ్లు

100 రోజులు కావవి 100 యుగాలు. జాత్యహంకారానికి 8 లక్షల మందిప్రాణాలు వదిలిన క్షణాలవి. తన వాళ్లు, పగ వాళ్లరక్తంతో నేల తడిస్తే.. గెలిచి ఏదో సాధించామంటూ ఓ వర్గం హింసా నాదం చేస్తే, భూ మాత సైతం కన్నీళ్లుపెట్టిన ఘడియలవి. 1994 ఏప్రిల్ 6న రువాండాలోజరిగిన ఈ ఘోర మారణకాండకు శనివారంతో పాతికేళ్లు నిండాయి. రువాండా రెండు జాతుల జనాభా కలయిక. ఒకరు పొట్టిగా బొద్దుగా కనిపించే టూట్సీలైతే, మరొకరు హుటూలు.

హత్యాకాండ ఎలా మొదలైంది?

పశువుల యజమానులు టుట్సీలు, వాటి కాపరులే హుటూలు. దేశం మొత్తం మీద 85 శాతం మంది హుటూలే ఉండేవారు. వీళ్లను 15 శాతం మంది టుట్సీలు పాలించేవారు. వందల ఏళ్లుగా టుట్సీలకిం ద అణిగిమణిగి బతుకుతున్న హుటూల్లో1959లో చైతన్యం వచ్చింది. అది పెరిగి పెరిగి ఉప్పెనలా మారి టుట్సీలపై పడింది. అకస్మాత్తుగావచ్చిన తిరుగుబాటుకు టుట్సీలు తలొంచక తప్పలేదు. హుటూల ధాటికి వేలాది మంది టుట్సీలు ప్రాణాలు అరచేత పట్టుకుని చుట్టుపక్కల దేశాలకు పారిపోయారు. ఏనాటికైనా తిరిగి తమ ప్రాంతాన్నిదక్కించుకు తీరుతామని శపథం చేశారు. దానికిరూపమే రువాండా పాట్రియాటిక్ ఫ్రంట్ (ఆర్పీఎఫ్). దాదాపు 30 ఏళ్ల కఠోర శ్రమ తర్వాత టుట్సీలఆర్పీఎఫ్ చాలా బలంగా తయారైంది. వెంటనేరువాం డాను తిరిగి ఆక్రమిం చడానికి ఆర్పీఎఫ్ దం-డెత్తిం ది. ప్రతిగా హుటూలు దాడికి దిగారు. దాదాపుమూడేళ్లపాటు నిత్యం జరిగిన పోరులో వేలాది మందిచనిపోయారు. 1993లో రెండు వర్గాల మధ్య శాంతిఒప్పందం జరిగింది. అంతా బాగానే ఉందనుకుంటున్న టైంలో (1994 ఏప్రిల్ 6) రువాండా ప్రెసిడెంట్జువెనల్ హెబ్యారిమన, బురుండి ప్రెసిడెంట్ సైప్రియన్ తర్యమిరా ప్రయాణిస్తున్న విమానం హైజాక్అయింది. వీళ్లిద్దరూ హుటూ జాతీయులే. వీళ్లతోపాటు విమానంలో ఉన్న అందరినీ దుండగులుచంపేశారు. వైరం మళ్లీ కోరలు చాచిం ది. ఆర్పీఎఫేఈ దారుణానికి ఒడిగట్టిందంటూ హుటూ అతివాదులు ఆరోపించారు. మంచితనం నటించి వంచించినటుట్సీ జాతిని తుడిచిపెట్టేయాలని జోరుగా ప్రచారంచేశారు. వాళ్ల పిలుపుకు హుటూ యువత గొంతుకలిపింది. అయితే తమను చంపేయాలనే ఆలోచనతోహుటూలే విమానాన్ని కూల్చారని టుట్సీలు ప్రత్యారోపణలు చేశారు. హుటూలు సర్కారు వ్యతిరేకులను,వాళ్ల కుటుంబాలతో సహా చంపించేశారు.

నరమేధం ముగిసిందిలా..

1994 జులై 4 నాటికి ఆర్పీఎఫ్ రువాండాలో సింహభాగాన్ని ఆక్రమించుకుంది. ఉగాండా బలగాలసాయంతో రాజధాని కిగాలిలోకి అడుగుపెట్టింది.సొంతవారినే శాసించడం మొదలుపెట్టింది. దీంతో20 లక్షల మంది హుటూలు కాంగో, టాంజానియా,బురుండి దేశాలకు పారిపోయారు. అప్పుడే కాంగోలోకలరా విజృంభణతో వేలాది మంది హుటూలు చనిపోయారు. హుటూ మిలటరీ దళాలతో కాంగోకు మంచిసంబంధాలు ఉండేవి. కానీ, హుటూలు కాంగోకుపారిపోయిన తర్వాత పరిస్థితి మారిపోయిం ది.హుటూ అతివాదులు కాంగో రాజధాని కిన్షాసాలోని మొబుటు సెసెసికో సర్కారును కూలదోశారు. దీంతో కొత్త ఆర్మీలు పుట్టుకొచ్చాయి. క్రమంగా చుట్టుపక్కల ఆరు దేశాల కన్ను కాంగో ఖనిజాలపై పడింది. అవన్నీకాంగోకు వచ్చి ఇక్కడి సంపద కోసం కొట్టుకోవడం మొదలుపెట్టాయి. 2003 వరకూ ఈ సమస్య కొనసాగింది. రువాండా బోర్డర్ లో ఇంకా కొన్ని గ్రూపులుయాక్టివ్ గానే ఉన్నాయి. హత్యాకాండకు నేతృత్వం వహించిన నాయకులను విచారించేందుకు ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రైబ్యునల్‌ ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏర్పాటు చేసింది. ఎన్నో విచారణల తర్వాత 93 మంది హుటూ నాయకులను ట్రైబ్యునల్దోషులుగా గుర్తించి, శిక్షలు విధించింది. రువాండాలోనే స్థానికంగా ‘గకక’ అనే ప్రత్యేక కోర్టులనుఏర్పాటు చేశారు. హత్యాకాం డకు సంబంధించిన 12లక్షల కేసులను విచారిస్తున్నాయి. అరస్టయిన వారిలో 10 వేల మంది జైళ్లలో నే చనిపోయారు

కట్టుకున్న భార్యల్ని, కన్న బిడ్డల్నీ వదల్లేదు

టుట్సీ జాతికి చెం దినవాళ్లు కనిపిస్తే చాలు..తన, పరభేదం అన్నది లేకుండా హుటూలు ప్రవర్తించారు. ప్రాణ భయంతో టుట్సీలూ కత్తులు తీశారు. అప్పటిదాకా స్నేహి తుల్లా బతికిన ఇరు పొరుగు వాళ్లు ఒకరినొకరు నరుక్కు న్నారు. టుట్సీ అమ్మాయిలను పెళ్లాడిన హుటూ అబ్బాయిలు.. ప్రాణ భయంతో వాళ్లను చంపేశారు. కన్నబిడ్డలనూ వదల్లేదు.హుటూలకు ప్రత్యేక ఐడీ కార్డులు ఇచ్చారు. వేలాది మంది టుట్సీ మహిళలను సెక్స్ బానిసలుగా మార్చారు. టుట్సీలను చంపి పాతిన స్థలాలకు ఎవరూ వెళ్లకుండా మిలటరీని కాపలా పెట్టారు. టుట్సీలను వెతికి పట్టుకు నిచంపేందుకు స్థానిక గ్రూపులు అడుగడుగునా జల్లెడ పట్టేవి. వీళ్ల కోసం హుటూ అతివాదులు ఓ రేడియో స్టేషన్, న్యూస్ పేపర్స్‌ ను నడిపారు.‘‘ఆ చీడ పురుగులను ఏరేయండి’’ అంటూ టుట్సీ జాతి అంతం గురిం చి మాత్రమే ప్రస్తావించేవి. చంపాల్సిన వ్యక్తుల పేర్లను రేడియోలో రోజూ ప్రకటిం చేవాళ్లు. రెండు వర్గాల దాడుల్లో8 లక్షల మందికి పైగా చనిపోయారు. ఇంతలారెచ్చిపో తున్న హుటూలను అడ్డుకునేం దుకుఅంతర్జా తీయ సమాజం ఎలాంటి ప్రయత్నంచేయలేదు. అప్పటికే సోమాలియాలో సైనికులను పోగొట్టుకు న్న అమెరికా నోరు మెదపలేదు.ఐక్యరాజ్య సమితితో కలిసి రువాండాలో పనిచేస్తున్న బెల్జియం కూడా పట్టించుకోలేదు.హుటూ సర్కారుతో మంచి సంబంధాలున్నఫ్రాన్స్ కూడా అంటీముట్టనట్లు ఊరుకుంది.