భారత్ పై టారిఫ్స్ పెంచేందుకు అమెరికా ప్లాన్..! యూరప్ దేశాలను రెచ్చగొడుతూ..

భారత్ పై టారిఫ్స్ పెంచేందుకు అమెరికా ప్లాన్..! యూరప్ దేశాలను రెచ్చగొడుతూ..

US Tariffs Hike: ఇప్పటికే భారత ఎగుమతులపై అమెరికా 50 శాతం టారిఫ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపకపోతే టారిఫ్స్ ఇంకా పెంచుతామని హెచ్చరిస్తోంది. యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిసెంట్ యూరోపియన్ దేశాలకు ఆంక్షల విషయంలో పిలుపునిస్తూ తమతో పాటు కలిసి రావాలని సూచించారు.

రష్యా నుంచి చమురు, గ్యాస్ కొంటున్న దేశాలపై కఠిన ఆంక్షలు విధించటానికి ప్రపంచ దేశాలు అమెరికాతో కలిసి ముందుకెళ్లటానికి రావాలని బిసెంట్ పిలుపునిచ్చారు. దీంతో చైనా, ఇండియా వంటి దేశాలను తమ దారికి తెచ్చుకోవాలని అమెరికా చూస్తున్నట్లు దీని ద్వారా అర్థం అవుతోంది. రానున్న కాలంలో ఆంక్షల ద్వారా టారిఫ్స్ పెరగొచ్చు లేదా తగ్గొచ్చని అయితే అవి శుక్రవారం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య అలాస్కాలో జరిగే చర్చల ఫలితాలపై ఆధారపడి ఉంటుందన్నారు బిసెంట్. 

Also Read:-ట్రంప్.. మనసులో ఇంత పెట్టుకున్నవా: భారత్‎పై అమెరికా సుంకాల వెనక అసలు కారణం ఇదా..?

ఇప్పటికే సెకండరీ టారిఫ్స్ కింద 25 శాతం సుంకాలు పెంచిన యూఎస్ మరోసారి ఇదే తరహాలో భారతదేశంపై పన్నులు పెంచటానికి సిద్ధంగా ఉన్నామని ఇకనైనా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లు మానాలని సూచించారు. ఇదే క్రమంలో అలాస్కాలో జరిగే చర్చల్లో పురోగతి లేకుండా ఒక అగ్రిమెంట్ కు రష్యా రాకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అవి తాను మాటల్లో చెప్పనని చేసి చూపిస్తానన్నారు ట్రంప్. 

2022 ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి అమెరికా, జపాన్, యూరోపియన్ దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే. పేరుకే ఆంక్షలు ఉన్నప్పటికీ అమెరికా, యూరోపియన్ దేశాలు మాత్రం తమ దేశ అవసరాలకు అనుగుణంగా రష్యాతో వ్యాపారం చేస్తూనే ఉన్నాయి. కానీ ఈ దేశాలు రష్యా ఉక్రెయిన్ పై యుద్ధానికి ఇండియా చమురు కొనుగేళ్ల డబ్బే ఆర్థికంగా సాయం చేస్తోందంటూ బ్లేమ్ చేస్తున్నాయి. అయితే భారత్ మాత్రం తమ దేశ ప్రజల ప్రయోజనాలు, ఎనర్జీ స్టెబిలిటీ కోసమే రష్యా నుంచి చవక ఆయిల్ కొంటున్నట్లు చెబుతోంది. 

మరిన్ని వార్తలు