ఇంటర్‌తో సెయిలర్ జాబ్స్.. ట్రైనింగ్‌‌లో నెలకు రూ.14,600 స్టైపెండ్

ఇంటర్‌తో సెయిలర్ జాబ్స్..  ట్రైనింగ్‌‌లో నెలకు రూ.14,600 స్టైపెండ్

ఇండియన్​ నేవీలో 2500 సెయిలర్​ పోస్టులు

ఇండియన్​ నేవీ సెయిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. 2021 ఆగస్టు బ్యాచ్ ద్వారా అన్​మ్యారిడ్​ యూత్​ ఆర్టిఫిషర్ అప్రెంటీస్ (ఏఆర్), సీనియర్ సెకండరీ రిక్రూట్స్(ఎస్ఎస్ఆర్) పోస్టుల్లో చేరొచ్చు. ఇంటర్​ ఎంపీసీతోనే కేంద్ర ప్రభుత్వ కొలువులో సుస్థిర భవితకు మార్గం సుగమం చేస్తున్న నేవీ సెయిలర్​ నోటిఫికేషన్​ వివరాలు, ప్రిపరేషన్​ టిప్స్..

నేవీలో ప్రధానంగా ఆఫీసర్స్​, సెయిలర్స్​, సివిలియన్స్​ మూడు రకాల పోస్టులు ఉంటాయి. ఆఫీసర్స్​ పోస్టులను యూపీఎస్సీ డిఫెన్స్​ సర్వీస్​, నావల్​ అకాడమీ ద్వారా భర్తీ చేస్తుండగా, సెయిలర్స్, సివిలియన్స్​ పోస్టులకు ఇండియన్​ నేవీ విడిగా నోటిఫికేషన్స్​ ఇస్తోంది. ప్రస్తుతం 2021 ఆగస్టు​ బ్యాచ్​ ద్వారా సెయిలర్స్​  పోస్టులకు  నోటిఫికేషన్​ ఇచ్చింది.

సెలెక్షన్ ప్రాసెస్
ఆన్​లైన్​ ఎగ్జామ్​, ఫిజికల్​ ఫిట్​నెస్​, మెడికల్​ ఎగ్జామ్​ మూడు దశల్లో ఎంపిక జరుగుతుంది. ఆర్టిఫిషర్ అప్రెంటీస్ కు దేశ‌‌వ్యాప్తంగా నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ ఆన్‌‌లైన్ టెస్టులో మెరిట్, సీనియర్ సెకండరీ రిక్రూట్స్ కు స్టేట్‌‌వైజ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌‌లైన్ టెస్టులో  అర్హత సాధించిన కనీసం 10 వేల మందిని ఫిజికల్ టెస్టులకు ఎంపిక చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అనర్హత పొందిన వారు 21 రోజుల లోపు రూ.40 చెల్లించి మిలిటరీ హాస్పిటల్‌‌లో రివ్యూ కోరవచ్చు.

ఎగ్జామ్​ ప్యాటర్న్​
ఆన్‌‌లైన్‌‌లో నిర్వహించే ఈ ఎగ్జామ్​లో 100 మార్కులకు 100 ప్రశ్నలిస్తారు. సమయం 60 నిమిషాలు. ఇంటర్ స్థాయిలో ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీల్లో ప్రింట్ చేస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఉంది. ఒక రాంగ్ ఆన్సర్‌‌కు ¼ మార్కు మైనస్ అవుతుంది. సెక్షనల్ కటాఫ్‌‌తో పాటు ఓవరాల్ కటాఫ్ మార్కులు పొందాలి. 

ఫిజికల్ ఫిట్‌‌నెస్ టెస్ట్
ఫిజికల్​ ఫిట్​నెస్​ టెస్ట్​లో అర్హత సాధించడం తప్పనిసరి. 7 నిమిషాల్లో 1.6 కిలోమీటర్లు పరిగెత్తడంతో పాటు 20 సిట్‌‌అప్స్, 10 పుషప్స్ తీయాల్సి ఉంటుంది. క్రీడలు, స్విమ్మింగ్, ఇతర కర్రిక్యులర్ యాక్టివిటీస్‌‌లో సర్టిఫికెట్ కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.

మెడికల్ స్టాండర్డ్స్
కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. గాలి పీల్చినప్పుడు చాతీ 5 సెం.మీ. విస్తరించాలి. చెవులు, దంతాలు శుభ్రంగా ఉండాలి. అద్దాలు ఉన్నా లేకున్నా కంటిచూపు 6/6 గా ఉండాలి. ముంజేతి లోపలి భాగంలో మాత్రమే టాట్టూలు అనుమతిస్తారు. శరీరంలో ఏ ఇతర భాగంలో పచ్చ బొట్టు ఉన్నా వారు అనర్హులే.

ట్రైనింగ్​:  ఆగస్టు 2021లో స్టార్ట్​ అయ్యే ఈ బ్యాచ్‌‌‌‌లో ఏఆర్​ అభ్యర్థులకు 9 నెలలు, ఎస్ఎస్ఆర్ అభ్యర్థులకు 22 నెలల పాటు ఐఎన్ఎస్ చిల్కా కేంద్రంలో ట్రైనింగ్​ ఇస్తారు. ట్రైనింగ్‌‌లో నెలకు రూ.14600 స్టైపెండ్ ఇస్తారు. శిక్షణ పూర్తిచేసుకున్నవారిని లెవెల్-3లో 20 ఏళ్ల పాటు (ఎస్ఎస్ఆర్ కు 15 ఏళ్లు) సర్వీసులో నియమిస్తారు. ఈ టైంలో నెలకు రూ.21,700 ప్రారంభ వేతనం, అలవెన్సులతో నెలకు 30 వేలకు పైగా శాలరీ ఇస్తారు. బుక్స్, యూనిఫామ్స్, ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తారు. లెవెల్ 8 వరకు ప్రమోషన్ పొందితే నెలకు దాదాపు లక్ష  వేతనం అందుతుంది. 

నోటిఫికేషన్
ఖాళీలు: 2500(ఆర్టిఫిషర్ అప్రెంటీస్–500, సీనియర్ సెకండరీ రిక్రూట్స్ – 2000)
అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్ కంపల్సరీ సబ్జెక్టులుగా, కెమిస్ట్రీ/బయాలజీ/ కంప్యూటర్ సైన్స్ ఆప్షనల్స్‌‌గా కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్/10+2 ఉత్తీర్ణత సాధించిన అవివాహిత పురుషులు అర్హులు. నిర్దేశిత  ఫిజికల్​ స్టాండర్డ్స్​ ఉండాలి.
వయసు:  నోటిఫికేషన్​ తేదీ నాటికి 17 నుంచి 20 ఏళ్ల మధ్య ఉండాలి.
ఫీజు: రూ.215. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్​ 26
చివరి తేది: ఏప్రిల్​ 30
కోర్సు ప్రారంభం: ఆగస్టు 2021
వెబ్‌‌సైట్: www.joinindiannavy.gov.in