కేంద్ర పన్నుల్లో తెలంగాణకు రూ.25,639 కోట్లు

కేంద్ర పన్నుల్లో తెలంగాణకు రూ.25,639 కోట్లు

న్యూఢిల్లీ, వెలుగు: 2024–-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర పన్నుల్లో వాటా కింద తెలంగాణకు రూ.25,639 కోట్లు (2.102 శాతం) రానున్నాయి. అందులో కార్పొరేట్ పన్ను రూ.8,051.77 కోట్లు కాగా.. ఆదాయపు పన్ను రూ.8,872.10 కోట్లు, సంపద పన్ను 0.26 కోట్లు, సెంట్రల్ జీఎస్‌టీ రూ.7,838.82 కోట్లు, కస్టమ్స్ రూ.523.20 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ రూ.312.84 కోట్లు, సర్వీస్ టాక్స్ రూ.0.86 కోట్లు, ఇతర పన్నులు, డ్యూటీలు రూ.40.51 కోట్ల చొప్పున ఉండనున్నాయి.

అలాగే ఏపీకి రూ.49,364.61కోట్లు (4.047 శాతం) దక్కనున్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్ (రూ.2,18,816.84 కోట్లు), బీహార్ (రూ.1,22,685.76 కోట్లు), మధ్యప్రదేశ్ (రూ.95,752.96 కోట్లు), పశ్చిమ బెంగాల్ (రూ.91,764.26 కోట్లు), రాజస్థాన్ (రూ.73,504.11 కోట్లు) రాష్ట్రాలకు అత్యధిక వాటా వెళ్లనుంది.