భారత్​లో 27శాతం టీబీ కేసులు: డబ్ల్యూహెచ్​వో

భారత్​లో 27శాతం టీబీ కేసులు: డబ్ల్యూహెచ్​వో

వాషింగ్టన్​: ప్రపంచంలోని మొత్తం టీబీ కేసుల్లో 27 శాతం భారత్​లోనే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్​వో) వెల్లడించింది. అంటే దేశ జనాభాలో 28 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడ్డట్టు అంచనా వేసింది. వారిలో మూడున్నర లక్షల మంది మరణించినట్టు తెలిపింది. 

ఆ తర్వాతి స్థానంలో ఇండోనేషియా(10 శాతం), చైనా(7.1 శాతం) దేశాలు ఉన్నాయంది. 5 శాతం కేసులతో పాకిస్తాన్​ 5వ స్థానంలో ఉంది. అదే సమయంలో టీబీ కేసుల కట్టడికి భారత్​ తీసుకుంటున్న చర్యలు సమర్థంగా పనిచేస్తున్నట్టు తెలిపింది. 2015లో ప్రతి లక్ష మందిలో 258 మంది ఈ వ్యాధి బారిన పడేవారిని 2022 నాటికి ఈ సంఖ్య 199కి పడిపోయిందని నివేదికలో పేర్కొంది.