కరీంనగర్‌‌ లో ఒకే బైక్‌‌పై 277 పెండింగ్‌‌ చలాన్లు

కరీంనగర్‌‌ లో   ఒకే బైక్‌‌పై 277 పెండింగ్‌‌ చలాన్లు

కరీంనగర్‌‌ క్రైమ్, వెలుగు : ఒకే బైక్‌‌పై 277 ట్రాఫిక్‌‌ చలాన్లు పెండింగ్‌‌లో ఉన్నట్లు పోలీసుల తనిఖీలో బయటపడింది. కరీంనగర్‌‌ ట్రాఫిక్‌‌ ఇన్‌‌స్పెక్టర్‌‌ రమేశ్‌‌, కానిస్టేబుల్‌‌ శ్రీనివాసరావు కలిసి శుక్రవారం పట్టణంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ టైంలో అటువైపు వచ్చిన కరీంనగర్‌‌లోని గోదాంగడ్డకు చెందిన అబ్దుల్ ఖయ్యూమ్‌‌కు చెందిన బైక్‌‌ను ఆపారు. ఆన్‌‌లైన్‌‌లో చలాన్లను తనిఖీ చేయగా రూ. 79,845 విలువైన 277 చలాన్లు పెండింగ్‌‌లో ఉన్నట్లు తేలింది. దీంతో బైక్‌‌ను స్వాధీనం చేసుకొని స్టేషన్‌‌కు తరలించారు.