రాయపట్నంలో 2.79 లక్షలు సీజ్

రాయపట్నంలో 2.79 లక్షలు సీజ్

ధర్మపురి, వెలుగు: జగిత్యాల జిల్లా రాయ పట్నం చెక్ పోస్ట్ దగ్గర పోలీసుల తనిఖీల్లో రూ. 2.79 లక్షలు పట్టుబడ్డాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా కారు లో తరలిస్తున్న నగదును సీజ్ చేసినట్లు సీఐ రామ్మూర్తి  తెలిపారు. నగదు తరలిస్తున్న కారు ధర్మపురి నుంచి మంచిర్యాల వెళ్తోందని పోలీసులు పేర్కొన్నారు.