మీరు గేమ్స్ ఆడండి.. మేము జీఎస్టీ వేస్తాం : నిర్మలా సీతారామన్​

మీరు గేమ్స్ ఆడండి.. మేము జీఎస్టీ వేస్తాం : నిర్మలా సీతారామన్​

న్యూఢిల్లీ: ఆన్​లైన్​ గేమింగ్​పై 28 శాతం జీఎస్​టీ అక్టోబర్​ 1 నుంచి అమలులోకి వస్తుందని ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మలా సీతారామన్​ వెల్లడించారు. ఢిల్లీ, గోవా వంటి కొన్ని  రాష్ట్రాలు 28 శాతం జీఎస్​టీ విధింపును రివ్యూ చేయాలని కోరినప్పటికీ బుధవారం సమావేశంలో జీఎస్​టీ కౌన్సిల్​ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. ఆన్​లైన్​ గేమింగ్​పై  పన్ను విధింపునకు వీలు కల్పించేలా తీసుకు రావల్సిన సవరణలపైనా జీఎస్​టీ  కౌన్సిల్​లో చర్చ జరిగిందని అన్నారు. 

బెట్స్​ మొత్తం​ ఫేస్​ వాల్యూ (బెట్టింగ్​ చేసే మొత్తం) పైన 28 శాతం జీఎస్​టీ విధించాలనే నిర్ణయానికి జీఎస్​టీ కౌన్సిల్​ కిందటి మీటింగ్​లోనే వచ్చింది. అయితే, చట్టంలో తీసుకు రావల్సిన సవరణల కోసం బుధవారం జీఎస్​టీ కౌన్సిల్​ మరోసారి సమావేశమైంది. ఆన్​లైన్​ గేమింగ్​పై 28 శాతం జీఎస్​టీ విధింపును ఢిల్లీ ఫైనాన్స్​ మినిస్టర్​ వ్యతిరేకించారని, మరోవైపు గోవా, సిక్కిం రాష్ట్రాలు ఫుల్​ ఫేస్​ వాల్యూపై కాకుండా  గ్రాస్​ గేమింగ్​ రెవెన్యూపై జీఎస్​టీ విధించాలని కోరాయని నిర్మలా సీతారామన్​ చెప్పారు. 

కర్నాటక, గుజరాత్​, మహారాష్ట్ర, ఉత్తర​ప్రదేశ్​ వంటి రాష్ట్రాలు జీఎస్​టీ కౌన్సిల్​ అంతకు ముందు సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్నే అమలు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. చట్టంలో సవరణలు పూర్తయ్యాక, అక్టోబర్​1 నుంచి 28 శాతం జీఎస్​టీ అమలులోకి వస్తుందని, అక్కడి నుంచి ఆరు నెలల తర్వాత అమలును రివ్యూ చేస్తామని ​ నిర్మలా సీతారామన్​ స్పష్టం చేశారు.