- జాబ్ ల పేరిట యువతను తీసుకెళ్లి సైబర్ నేరాలు చేయిస్తున్న మోసగాళ్లు
- పార్లమెంటులో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ప్రస్తావన
- వెంటనే స్పందించి రక్షణ చర్యలు చేపట్టిన కేంద్రం
నిజామాబాద్, వెలుగు: జాబ్స్కోసం థాయ్‌లాండ్, మయన్మార్ కు వెళ్లిన తెలుగువాళ్లను మోసాగాళ్లు బ్లాక్‌మెయిలింగ్‌తో సైబర్‌నేరాలు చేయిస్తున్నారని, బాధితులకు రక్షణగా ఉండాలని కేంద్రం నిర్ణయించిందని నిజామాబాద్ఎంపీ అర్వింద్ ధర్మపురి తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 316 మందిని గుర్తించి, వారిలో 297 మందిని క్షేమంగా వెనకి తీసుకొచ్చిందన్నారు.
గురువారం ఆయన మీడియాకు ప్రెస్ నోట్ రిలీజ్చేశారు. జాబ్ఆఫర్లతో మోసగాళ్లు తెలుగురాష్ట్రాల యూత్‌ను థాయ్‌లాండ్, మయన్మార్బార్డర్లోని టాచిలేక్, ష్వేకొక్కో, మయావాడి ప్రాంతాలకు తీసుకెళ్లారన్నారు. అక్కడికి వెళ్లాక పాస్‌పోర్టులు లాక్కొని సైబర్‌నేరాలు చేయిస్తూ యువత భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారన్నారు.
దీనిపై తాను పార్లమెంట్లో ప్రస్తావించడంతో విదేశీ వ్యవహారాల శాఖ తక్షణమే స్పందించిందన్నారు. దేశం నుంచి 2,545 మందిని అక్రమంగా తరలించారని గుర్తించిందని, 2,390 మందిని రక్షించిందని పేర్కొన్నారు. వీరిలో తెలుగువారు 316 ఉండగా, 297 మంది విముక్తి లభించిందన్నారు. భారతీయుల క్షేమం, భద్రతకు కేంద్ర అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
