జమ్మూలో 2G సేవలు: ఆంక్షలు సడలిస్తున్న కేంధ్రం

జమ్మూలో 2G సేవలు: ఆంక్షలు సడలిస్తున్న కేంధ్రం

జమ్మూకశ్మీర్ లో ఒక్కొక్కటిగా ఆంక్షలు సడలిస్తామని  అధికార యంత్రాంగం ప్రకటించింది. అయితే సోమవారం నుంచి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కానున్నాయి. నిన్న  అంతా ప్రశాంతంగానే ఉండడంతో ఇవాళ మరికొన్ని చోట్ల రిలీఫ్ ఇవ్వనున్నారు. ఇవాళ 2జీ మొబైల్ ఇంటర్నెట్ ను జమ్ము, రేసాయ్, సాంబా, కతువా, ఉధంపూర్ జిల్లాల్లో ప్రారంభించారు. మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను ఆగస్ట్ 5 నుంచి నిలిపేశారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఈ నిషేధం విధించారు. ఇప్పుడిప్పుడే ఆంక్షలు సడలిస్తున్నారు.