V6 లైవ్​కు తిరుగులేదు..యూట్యూబ్ లో ఒకేసారి 2 లక్షల మంది వ్యూయర్స్

V6 లైవ్​కు తిరుగులేదు..యూట్యూబ్ లో ఒకేసారి 2 లక్షల మంది వ్యూయర్స్

 

హైదరాబాద్​, వెలుగు: దుబ్బాక ఉపఎన్నికల లైవ్ కవరేజీలో V6 న్యూస్ చానెల్ ప్రత్యేకంగా నిలిచింది. ఒకేసారి 2 లక్షల మందికిపైగా యూట్యూబ్ లైవ్ లో ఫాలో అయి ఎన్నికల అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ఒక్క సెగ్మెంట్ బైపోల్ ఫలితం కోసం, ఒక రీజినల్ చానెల్ ను ఇంత మంది లైవ్ లో ఫాలో కావడం అరుదైన విషయం. బీహార్ తోపాటు పలు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తున్న టైమ్​లో పూర్తిగా దుబ్బాక బైపోల్ పైనే ఆసక్తి పెరిగింది. ఎదురులేకుండా ఉన్న టీఆర్ఎస్ కు దుబ్బాకలో బీజేపీ గట్టి పోటీ ఇస్తోందన్న అంచనాలతో ఉత్కంఠ ఎక్కువైంది. దీంతో రిజల్ట్ ఎట్లా ఉంటుందోనని మన రాష్ట్రంతో పాటు అటు ఏపీలోనూ, ఇతర రాష్ట్రాల్లో, ముఖ్యంగా విదేశాల్లో ఉన్న తెలుగువాళ్లు ఇంట్రెస్ట్ గా చూశారు. ఫలితాల కవరేజీలో ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా, సూటిగా పక్కా సమాచారం అందించడంతో ఎక్కువమంది V6 యూట్యూబ్ లైవ్ న్యూస్ ను ఫాలో అవుతూ వచ్చారు. నాన్ స్టాప్ కవరేజ్ ఇవ్వడంతోపాటు ప్రతి రౌండ్ కూ ఉత్కంఠగా ఫలితాలు రావడంతో మరింత మంది వ్యూయర్స్ పెరిగారు. ఏకకాలంలో 2 లక్షల మందికిపైగా వ్యూయర్స్  V6 న్యూస్ ను ఫాలో అవుతూ చివరి ఫలితం వచ్చేవరకు చూశారు. మరోవైపు రాష్ట్రంలో ఎక్కడ చూసినా జనం V6 న్యూస్  చూస్తూ కన్పించారు. మెజారిటీ తక్కువగా ఉండడం, ఒక్కో రౌండ్ కు లీడ్స్ మారిపోవడం సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించింది. దీంతో కౌంటింగ్ సెంటర్ల నుంచి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ వరకు అన్నిచోట్లా ప్రతిక్షణం అప్ డేట్స్  తెలుసుకున్నారు. టీఆర్ఎస్ సహా అన్ని పార్టీల కీలక నేతలు,  అనుచరులతో కలిసి ఆఫీస్ ల్లో V6  లైవ్ న్యూస్  ఫాలో అయ్యారు.

విశ్వసనీయతకు  అద్దంపట్టిన ఆదరణ

వార్తా ప్రసారాల్లో తనదైన ముద్రవేసిన V6 న్యూస్ ఉద్యమకాలం నుంచీ విశ్వసనీయతే పునాదిగా జనం ఆదరణ పొందింది. అందుకే ప్రతి సందర్భంలోనూ లైవ్ వ్యూస్ లో V6 తనదైన ముద్ర వేస్తోంది. కరోనా లాక్ డౌన్ సమయంలో చానెల్ ప్రసారాలను జనం ప్రతి క్షణం ఆసక్తిగా ఫాలో అయ్యారు. అప్పట్లో సీఎం కేసీఆర్ లైవ్ ప్రెస్ మీట్ ను V6 యూట్యూబ్ చానెల్ లో లక్షా 13 వేల మందికిపైగా లైవ్ లో చూడడం సంచలనం రేపింది. దుబ్బాక బైపోల్ సమయంలోనూ అన్ని పార్టీల ప్రచారంతోపాటు స్థానిక అంశాలపై V6 సమగ్ర కథనాలను అందించింది. జనంలో చర్చ జరుగుతున్న పలు అంశాలతోపాటు పార్టీల రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలను జనం ముందుంచింది. చివరికి ఫలితాల రోజున గందరగోళం లేకుండా స్పష్టమైన అప్ డేట్స్ అందించిన కవరేజీకి తిరుగులేని ఆదరణ దక్కింది. ఇది V6 విశ్వసనీతయను మరోసారి చాటింది.