ముగ్గురు బీఆర్ఎస్ సోషల్ మీడియా వ్యక్తులు అరెస్ట్

ముగ్గురు బీఆర్ఎస్ సోషల్ మీడియా వ్యక్తులు అరెస్ట్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అభ్యంతరక పోస్టింగ్ లు పెడుతున్న ముగ్గురు బీఆర్ఎస్ సోషల్ మీడియా వ్యక్తులు పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పనిచేసే కొంతమంది.. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి చెప్పుల దండ వేసిన ఫోటోను పోస్ట్ చేయడంతోపాటు పలు సోషల్ మీడియా గ్రూప్స్ లో వైరల్ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగిన ముగ్గురు బీఆర్ఎస్ సోషల్ మీడియాకు చెందని వ్యక్తులను అరెస్ట్ చేసి పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇందులో మరికొంతమందిని పోలీసులు అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.