 
                                    రాజస్థాన్లోని కోట నగరంలో మెడికల్, ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ లకు కోచింగ్ తీసుకుంటున్న ముగ్గురు విద్యార్థులు హాస్టల్ లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరంతా 16 నుంచి 18 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. వీరిలో బీహార్ కు చెందిన ఇద్దరు స్టూడెంట్స్ నీట్ ఎంట్రెన్స్ కు, మరో స్టూడెంట్ మెడికల్ ఎంట్రెన్స్ కు ప్రిపేర్ అవుతున్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురు ఒకే హాస్టల్ లో ఉంటున్నారు. అయితే విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన హాస్టల్ గదుల్లో పోలీసులకు ఎలాంటి సూసైడ్ నోట్స్ దొరకలేదు. నీట్, మెడికల్ ఎంట్రెన్స్ లకు కోట నగరంలోని కోచింగ్ సెంటర్లు ఎంతో ఫేమస్. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకుంటుంటారు.

 
         
                     
                     
                    