3 కోట్ల మందికి వ్యాక్సిన్ ఖర్చులు కేంద్రానివే

3 కోట్ల మందికి వ్యాక్సిన్ ఖర్చులు కేంద్రానివే

దేశ వ్యాప్తంగా 3 కోట్ల ఫ్రంట్ లైన్ వారియర్స్ కు  వ్యాక్సిన్ ఖర్చులను కేంద్రప్రభుత్వమే భరిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.  ఈ నెల 16 నుంచి దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ మొదలు కాబోతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్బంగా మాట్లాడిన మోడీ.. అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని  హెల్త్ & ఫ్రంట్‌లైన్ వర్కర్స్  సుమారు 3 కోట్ల మంది ఉంటారని.. మొదటి దశలో ఈ 3 కోట్ల మందికి టీకాలకు అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సిన అవసరం లేదన్నారు. ఈ ఖర్చులను కేంద్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు.

ఈ మూడు కోట్ల మందిలో పారిశుధ్య కార్మికులు, ఇతర ఫ్రంట్‌లైన్ కార్మికులు, రక్షణ దళాలు, పోలీసులు, ఇతర పారా మిలటరీ దళాలకు మొదటి దశలో టీకాలు వేస్తారన్నారు.   సెకండ్ ప్లేసులో 50 ఏళ్లు పైబడిన వారికి , 50 ఏళ్లలోపు ఉండి వారిలో  అనారోగ్యానికి గురైన వారికి వ్యాక్సిన్ అందిస్తామన్నారు. జూలై వరకు 30 కోట్ల మందికి వ్యాక్సిన్ అందిస్తామన్నారు.