బీఎఫ్​ఐఎల్ చేతికి 3 ఫోర్జింగ్​ లైన్లు

బీఎఫ్​ఐఎల్ చేతికి 3 ఫోర్జింగ్​ లైన్లు

హైదరాబాద్, వెలుగు: క్రాంక్ షాఫ్ట్‌‌‌‌‌‌‌‌లు, ఫోర్జ్​డ్​ విడిభాగాలు తయారు చేసే ప్రెసిషన్ ఇంజనీరింగ్ కంపెనీ బాలు ఫోర్జ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (బీఎఫ్​ఐఎల్​) మూడు ఫోర్జింగ్ లైన్‌‌‌‌‌‌‌‌లను కొన్నట్లు ప్రకటించింది.  ఇవి ఏటా 72 వేల టన్నుల ఉత్పత్తి చేయగలుగుతాయి.   ఈ ఫోర్జింగ్ లైన్లు కర్ణాటకలోని బెలగావి క్యాంపస్‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న ప్రెసిషన్ ఇంజనీరింగ్ విస్తరణతో కలిసిపోతాయని కంపెనీ తెలిపింది. 

తద్వారా బీఎఫ్​ఐఎల్​ ఇంటిగ్రేటెడ్ వన్-స్టాప్ సొల్యూషన్ ప్రొవైడర్‌‌‌‌‌‌‌‌గా మారుతుందని పేర్కొంది.  రైల్వేలు, రక్షణ, చమురు, గ్యాస్, మైనింగ్, ఏరోస్పేస్,  అల్యూమినియం పరిశ్రమలకు తాము అడ్వాన్స్​డ్​ మెషినింగ్​ సొల్యూషన్స్​ను అందిస్తున్నామని బీఎఫ్​ఐఎల్ ​తెలిపింది.