హైదరాబాద్లో 3.9 కిలోల హాష్ ఆయిల్ పట్టివేత.. ఏపీకి చెందిన ముగ్గురు అరెస్ట్

హైదరాబాద్లో 3.9 కిలోల హాష్ ఆయిల్ పట్టివేత.. ఏపీకి చెందిన ముగ్గురు అరెస్ట్

హైదరాబాద్ శివారులో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు వ్యక్తులను ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి 3.8 కిలోల హాష్ ఆయిల్, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు త్వరితగతిన లాభాల కోసం డ్రగ్స్‌ వ్యాపారం చేస్తూ, తక్కువ ధరకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి హాషీష్‌ ఆయిల్‌ను కొనుగోలు చేసి హైదరాబాద్‌లో అధిక ధరలకు అమ్ముతున్నారు. నిందితులను ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాకు చెందిన తాళ్లపురెడ్డి సుధీర్ (23), డ్రైవర్, గంజాయి సాగు చేస్తున్న రైతు తాళ్లపురెడ్డి దేముళ్లు (26), కూల్ డ్రింక్స్ వ్యాపారం చేస్తున్న కేశంశెట్టి శంకర్ రావు(26) లుగా గుర్తించారు. 

ప్రధాన నిందితుడు సుధీర్.. ఒడిశా నుంచి డ్రగ్స్ వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. దేముళ్లు, శంకర్ రావులు  సుధీర్ తో కలిసి డ్రగ్స్ రవాణా చేయడంలో పార్టినర్స్ గా చేరారు. ముగ్గురు కలిసి సుధీర్ సొంత గ్రామానికి 70 కిలోమీటర్లు దూరంలో ఉంటే అల్లంచెట్టు కొండల నుంచి హాష్ ఆయిల్ ను తయారు చేసి హైదరాబాద్ రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో శక్రవారం హాష్ ఆయిల్ తో హైదరాబాద్ లోని ఓఆర్ ఆర్ చేరుకోగానే.. ఆదిభట్ల పోలీసులు సుధీర్, దేముళ్లు, శంకర్ రావు లను అరెస్ట్ చేశారు.