
- తరచూ ఫ్లైట్స్‌కు అడ్డొస్తున్న బర్డ్స్
- నాలుగు రోజుల్లో మూడు ఇన్సిడెంట్స్
వడోదర: గుజరాత్‌లోని వడోదర ఎయిర్‌పోర్టును పక్షులు వణికిస్తున్నాయి. ఫ్లైట్స్ టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో పక్షులు అడ్డొస్తూ ఇబ్బంది పెడుతున్నాయి. గత నాలుగు రోజుల్లో మూడు సార్లు ఫైట్స్‌కు పక్షులు అడ్డురావడంపై ఎయిర్‌పోర్ట్ అధికారులు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వరుస ఘటనలతో వివిధ ఎయిర్‌లైన్స్‌కు చెందిన మూడు విమానాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. వర్షాకాలం ప్రారంభం కావడంతో ఎయిర్‌పోర్టు ఏరియాలో చిన్నచిన్న పురుగులు, అక్కడక్కడ నిలిచిన నీటితోపాటు ఆహార పదార్థాలు పేరుకుపోవడం వల్ల పక్షుల గుంపులు ఇక్కడికి వస్తున్నాయని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ చరణ్ సింగ్ తెలిపారు. టేకాఫ్ సమయంలో పక్షులు బలంగా వచ్చి తాకడం వల్ల పెద్ద శబ్దం వస్తుందని, డ్యామేజ్ అయ్యే అవకాశాలూ ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ఘటనలతో ఫ్లైట్స్ ఆలస్యంగా బయల్దేరుతున్నాయన్నారు.