
- దుబాయిలో అవస్థలు పడుతున్న ముగ్గురు కార్మికులు
- బాధితుల్లో ఒకరు నిజామాబాద్ జిల్లా వాసి
రామడుగు, వెలుగు : దుబాయిలో తాము పని చేస్తున్న కంపనీలు జీతాలివ్వక వేర్వేరు రాష్టాలకు చెందిన ముగ్గురు ఇండియన్స్ బజార్న పడ్డారు. వీరిలో ఒకరు నిజామాబాద్ జిల్లా వాసి. కంపనీని వదిలి ఎక్కడో పని చేసుకుందామనుకుంటే పాకిస్తాన్ కార్మికులు వీళ్లను కొట్టి పైసలు, ఐడెంటి టీకార్డులు గుంజుకుని పోయారు. దీంతో వారు ఎక్కడ పని చేసుకోలేక, తిరిగి ఇండియాకు రాలేక అవస్థ పడుతున్నారు.దుబాయ్ లోని తెలంగాణ వాసులు ఎంబసీలో అవసరమైన సాయాన్ని చేస్తున్నారు. దాతలెవరన్నా టికెట్ ఖర్చులివ్వా లని కోరుతున్నారు.
రాజస్థాన్‌కు చెందిన అస్లాం మహబూబ్, మధ్యప్రదేశ్ కు చెందిన రాజేశ్, నిజామాబాద్ జిల్లా భీం గల్ మండలం సికింద్రాపూర్‌కు చెందిన రాజు దుబాయిలో వేర్వేరు కంపనీల్లో పనిచేశారు. ఆ యాజమాన్యాలు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో రెండు నెలల కింద అక్కడ పని మానేసి వేరే చోటపని వెతుక్కో వడం మొదలుపెట్టారు. ఒక రాత్రి వీరు మసీదు ముం దు నిద్రపోగా పాకిస్తాన్ కార్మికులు వీరిని కొట్టి డబ్బులు, ఐడెంటిటీ కార్డులు ఎత్తుకెళ్లారు.
కల్లివెల్లి అయినవారికి ఐడెంటి టీ కార్డ్స్ లేకుం డాఎవరూ పని ఇవ్వరు. దీంతో వారంరోజులుగా వీరు పస్తులతో గడుపుతున్నారు. వారం కింద వీళ్లను గమనించిన రామడుగుకు చెందిన ఎల్లాల శ్రీనన్న సేవా సమితి కో ఆర్డినేటర్ చిలుముల రమేశ్ తన క్యాంపునకు తీసుకువచ్చి బ్లాం కెట్లు ఇచ్చి, రెండు పూటలా అన్నం పెడుతున్నాడు. ఇద్దరికి ఇన్‌ఫెక్షన్ కాగా వైద్యం చేయిస్తున్నాడు. కల్లివెల్లి అయిన చాలామందిని సొంత ఊళ్లకు పంపిన గుండెల్లి నర్సింహులుకు వీరి గురిం చి సమాచారమిచ్చాడు. ఇండియన్ ఎంబసీలో వారం రోజుల్లో పేపర్ వర్క్ పూర్తి చేసేందుకు నర్సింహులు ముందుకొచ్చారు. అయితే టికెట్ ఖర్చు లను ఎవరైనా స్పాన్సర్స్ చేయాలని, దాతలు 00981557906143, 00971559346999లో సంప్రదిం చాలని రమేశ్ కోరారు.