గుడ్ న్యూస్ .. టీచర్ల ప్రమోషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

 గుడ్ న్యూస్ .. టీచర్ల ప్రమోషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  టీచర్ల ప్రమోషన్లకు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫైల్ పై సీఎం రేవంత్ రెడ్డి సైన్ చేశారు. దీంతో త్వరలో ఎస్ జీటీలు, స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు కల్పించనున్నారు. దీనికి సంబంధించి మరో రెండు రోజుల్లో షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు వచ్చే ఛాన్స్ ఉంది. a

ALSO READ | దేశంలో స్విగ్గీ పాలిటిక్స్ తెరపైకొచ్చాయ్.. ప్రజాస్వామ్యానికి ఇవి చాలా డేంజర్: CM రేవంత్

స్టేట్​లోని సర్కారు బడుల్లో 1.10 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బదిలీలు, ప్రమోషన్లు ఇవ్వాలని టీచర్లు కోరుతున్నారు.  2023 సెప్టెంబర్, అక్టోబర్ లో మల్టీజోన్ 1 పరిధిలోని హెడ్మాస్టర్ల బదిలీలు, ఆ పోస్టులకు ప్రమోషన్లు, స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు జరిగాయి. ఆ తర్వాత కోర్టు కేసులతో ఆగిపోయాయి.

 మళ్లీ 2024 జూన్/ జులై నెలల్లో మల్టీజోన్ 2 పరిధిలోని హెడ్మాస్టర్లకు ప్రమోషన్లు, బదిలీలు, స్కూల్ అసిస్టెంట్ బదిలీలు, ప్రమోషన్లు, ఎస్​జీటీల బదిలీలు జరిగాయి. అయితే కొన్ని కారణాల వల్ల మల్టీ జోన్ 2లో  మిగిలిపోయినవి..పదవి విరమణ వల్ల ఖాళీగా ఉన్న పోస్టులను  భర్తీ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో వీటికి  ప్రభుత్వం  గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టీచర్లకు ప్రమోషన్లు రానున్నాయి.