
న్యూఢిల్లీ : ఈ వారం మూడు కంపెనీల ఐపీఓలు ఇన్వెస్టర్ల ముందుకు రానున్నాయి. గోపాల్ స్నాక్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.1,325 కోట్లు సేకరించనుంది. ఆర్‌కే స్వామీ, జేజీ కెమికల్స్ ఐపీఓలు కూడా ఈ వారం ఓపెన్ కానున్నాయి. రాజ్‌కోట్‌కు చెందిన గోపాల్ స్నాక్స్ ఐపీఓ ఈ నెల 6–11 మధ్య ఓపెన్‌లో ఉంటుంది. షేరుని రూ.381–401 రేంజ్‌లో కంపెనీ అమ్ముతోంది. ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ సర్వీసెస్ కంపెనీ ఆర్‌కే స్వామి ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.423.56 కోట్లు సేకరించనుంది. మార్చి 4–6 మధ్య ఈ కంపెనీ ఐపీఓ ఓపెన్‌లో ఉంటుంది. షేరు ధర రూ. 270–288. జింక్ ఆక్సైడ్‌ను తయారు చేసే జేజీ కెమికల్స్ పబ్లిక్ ఇష్యూ మార్చి 5 న ఓపెన్ అవుతుంది. ఏడున ముగస్తుంది. షేరు ధర రూ.210–221. ఐపీఓ సైజ్ రూ.251.2 కోట్లు.