కాల్పుల కలకలం..ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మృతి

కాల్పుల కలకలం..ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మృతి

ఉత్తర్ ప్రదేశ్ ఘాజియాబాద్ జిల్లాలోనిలో దారుణం జరిగింది. ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులపై గుర్తు తెలియని దుండగులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా...ఒకరు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. లోని టోలి మొహల్లా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బట్టల వ్యాపారి రియాజుద్దీన్ ఇంట్లోకి పైకప్పు ద్వారా వచ్చిన దుండగులు...ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రియాజుద్దీన్ సహా ఆయన కొడుకులు ఇమ్రాన్, అజారుద్దీన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రియాజుద్దీన్ భార్య అఫ్సానాను తుపాకీతో తలపై బలంగా కొట్టారు దీంతో ఆమెను హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. తుపాకీ పేలుళ్ల శబ్ధానికి చుట్టు పక్కలా వారు వచ్చినప్పటికీ లోపలివైపు లాక్ వేసి ఉండడంతో వెళ్లలేకపోయారు. ఘటన జరిగిన 20 నిమిషాల తర్వాత అఫ్సానా తలుపు తెరిచారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ టీం కూడా అక్కడకు చేరుకుంది.