
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షిత కేజ్రీవాల్ ను మోసం చేసిన కేసులో ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. సాజిద్, కపిల్, మన్వేంద్ర అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. సెకండ్ హ్యాండ్ సోఫాను ఆన్ లైన్ లో అమ్మేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఆమె అకౌంట్ నుంచి వీళ్లు రూ. 34 వేలు కొట్టేశారు. వీరిపై సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు చేశారు.
కేజ్రీవాల్ కూతురు హర్షిత ఫిబ్రవరి 7న ఆన్ లైన్లో సోఫాను అమ్ముతున్నట్టు పోస్టు చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి కస్టమర్ గా మెసేజ్ చేసిన… చిన్న మొత్తాన్ని ఆమె అకౌంట్ కు బదిలీ చేశాడు. ఆ తర్వాత బార్ కోడ్ ను స్కాన్ చేయాలని కోరాడు. అతని మాటలను నమ్మిన హర్షిత బార్ కోడ్ ను స్కాన్ చేశారు. ఆ తర్వాత ఆమె అకౌంట్ నుంచి రెండు విడతలుగా రూ. 20 వేలు, రూ. 14 వేలను కొట్టేశారు. మోసంపై ఆమె ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.