సుమతీ శతకం మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్..

సుమతీ శతకం మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్..

 అమర్‌‌దీప్ చౌదరి,  శైలి చౌదరి జంటగా ఎంఎం నాయుడు దర్శకత్వంలో సుధాకర్ కొమ్మాలపాటి నిర్మిస్తున్న చిత్రం ‘సుమతీ శతకం’. ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా, మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ‘ఎక్కడే ఎక్కడే’ అంటూ ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.  సుభాష్ ఆనంద్ కంపోజ్ చేసిన ఈ పాటకు  తిరుపతి జావన లిరిక్స్ రాయగా,  ధనుంజయ్ సీపాన పాడాడు. 

‘ఎక్కడే ఎక్కడే ఎక్కడే.. నేనున్నది నీకై ఇక్కడే.. నాకెదురే పడతావు ఎప్పుడే.. నువ్వెవరో తెలియదుగా.. అయినా నిన్నే వదలనుగా..’ అంటూ సాగిన పాటలో అమర్‌‌దీప్ ఎనర్జిటిక్  డ్యాన్స్ మూమెంట్స్​తో ఆకట్టుకున్నాడు.   టేస్టీ తేజ, మహేష్ విట్ట, జేడీవీ  ప్రసాద్, ఆకెళ్ళ గోపి కృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల  కానుంది.