భారత్ లో 26కు చేరిన ఒమిక్రాన్‌ కేసులు

 భారత్ లో 26కు చేరిన ఒమిక్రాన్‌ కేసులు

దేశంలో ఒమిక్రాన్‌ కేసులు క్రమంగా పెరుతున్నాయి. ఈ రోజు వరకు మొత్తంగా కేసుల సంఖ్య 26 కు చేరుకుంది. లేటెస్టుగా  గుజరాత్‌లో రెండు కేసులు బయటపడ్డాయి. వీరిలో ఒకరు దక్షిణాఫ్రికా నుండి వచ్చారు.డిసెంబర్‌ 4న జింబాబ్వే నుండి ఓ వ్యక్తి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు రాగా.. ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. జినోమ్‌ స్వీకెన్స్‌లో ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనతో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన వారికి పరీక్షలు నిర్వహించగా.. ఒకరికి వైరస్‌ ఉన్నట్లు తేలింది. దక్షిణాఫ్రికా నుండి వచ్చిన వ్యక్తి పూర్తి స్థాయిలో వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఆయనతో సన్నిహితంగా ఉన్న 10 మందిని అధికారులు క్వారెంటైన్‌లో ఉంచి.. పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మరోకేసు ముంబైలోని  ధారావి ఏరియాలో టాంజానియా నుంచి వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్ బయటపడింది.  ఆయన్ను ముంబైలోని సెవెన్ హిల్స్ హాస్పిటల్ లో అడ్మిట్ చేసినట్టు ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. పేషెంట్ కు ఎలాంటి లక్షణాలు లేవని... వ్యాక్సిన్ కూడా వేసుకోలేదని వివరించింది. అతడిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్ పోర్ట్ కు వచ్చిన ఇద్దరు వ్యక్తులను కూడా ట్రేస్ చేసినట్టు తెలిపింది.