
ఉత్తర్ ప్రదేశ్ రాయ్ బరేలిలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెళ్లెళ్లు అనుమానాస్పద స్థితిల చనిపోయారు. ముగ్గురి వయస్సు పదేళ్లలోపే ఉంటుందన్నారు పోలీసులు. విషపూరితమైన ఆహారం తీసుకోవడం వల్లే చనిపోయారని కుటుంబసభ్యులు చెప్తున్నారు. తన పిల్లలు ముగ్గురు లూజ్ స్నాక్స్ కొనుక్కొని తిన్నారని, ఆ తర్వాత కొద్దిసేపటికే వాళ్లు వాంతులు చేసుకోవడంతో ఎన్‌టీపీసీ హాస్పిటల్‌కు తీసుకెళ్లామని తండ్రి నవీన్ కుమార్ సింగ్ చెప్పాడు. అక్కడ చికిత్స పొందుతూ ముగ్గురూ చనిపోయారని అతడు విలపించాడు. ఇప్పటికే పోస్టుమార్టం పూర్తి చేయగా.. ఆ పిల్లల మరణానికి కారణం తెలియలేదని సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ వినయ్ కుమార్ మిశ్రా చెప్పారు. ఫుడ్ శాంపిల్స్ పరీక్షించేందుకు ప్రయోగశాలకు పంపామని తెలిపారు.