జమ్మా కశ్మీర్లో ఎన్కౌంటర్ ముగ్గురు టెర్రరిస్టులు హతం.. సైనికులకు గాయాలు

జమ్మా కశ్మీర్లో  ఎన్కౌంటర్ ముగ్గురు టెర్రరిస్టులు హతం.. సైనికులకు గాయాలు

జమ్మూ కశ్మీర్ లో మూడు రోజులుగా ఆపరేషన్ అకాల్ కొనసాగుతోంది. బలగాలకు, టెర్రరిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఆదివారం (ఆగస్టు 03) జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కౌంటర్ టెర్రరిజంలో భాగంగా ఆపరేషన్ అకాల్ మూడు రోజులకు చేరకుంది.  ఈ ఆపరేషన్ లో మొత్తం మృతుల సంఖ్య 6 కు చేరుకుంది. 

కుల్గాం జిల్లాలోని అకాల్ ఫారెస్టులో శనివారం రాత్రి నుంచి కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. జమ్మూకశ్మీర్ పోలీసులు, ఆర్మీ బలగాల జాయింట్ టీమ్ ఆపరేషన్ లో భాగంగా ఫారెస్ట్ ప్రాంతాలను గాలిస్తూనే ఉంది. కంటిన్యూగా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. 

అకాల్ ఫారెస్ట్ లో భద్రతా బలగాలు టెర్రరిస్టుల కోసం కార్డన్, సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. ఆ ప్రాంతంలో టెర్రరిస్టులు తలదాచుకుంటున్నట్లు ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారంతో సెక్యూరిటీ ఫోర్సెస్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. 

శనివారం మృతి చెందిన టెర్రరిస్టులు ద రెసిస్టెంట్ ఫ్రంట్ (TRF) గ్రూప్ కు చెందిన టెర్రరిస్టులుగా అధికారులు తెలిపారు. నిషేధిత లష్కరే తొయిబా గ్రూప్ కు అనుబంధ సంస్థ ఇది. పహల్గాం టెర్రర్ అటాక్ కు బాధ్యులం తామేనని ఈ గ్రూప్ ప్రకటించుకుంది. పహల్గాం దాడిలో 26 మంది అమాయకులు మృతి చెందారు. దీంతో ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించి పాక్ బార్డర్ లో ఉన్న టెర్రర్ క్యాంపులను, ఆర్బీ బేసిన్ లను కూల్చేసింది.